పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా నవరాత్రుల పూజలు అందుకున్న ఆ విఘ్నేశ్వరుడి యొక్క లడ్డును చేవెళ్ల గణేష్ రూ. 45 వేలకు సొంతం చేసుకున్నాడు. ఆదర్శ యువజన సంఘ సభ్యులు, కమిటీ మెంబర్లు వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఇట్టి కార్యక్రమాన్నీ విజయవంతం చేసిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.