ఫోర్జరీ అగ్రిమెంట్‌తో భూమి కాజేశారు:సీపీఎం మైపాల్.
వికారాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామంలో సర్వే నెం. 167, 178లో ఉజ్వల పేరుపై ఉన్న 13 ఎకరాల 16 కుంటల భూమిని ఫోర్జరీ అగ్రిమెంట్ సృష్టించి, పెండింగ్ మ్యుటేషన్ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు మైపాల్, బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి, భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.