మిషన్ భగీరథ పైపు లీకేజీ: పాఠశాల గోడ కూలి విద్యార్థులకు ప్రమాదం

892చూసినవారు
పరిగిలోని నారాయణ పూర్ ప్రాథమిక పాఠశాలలో మిషన్ భగీరథ పైపులు లీకేజీ కారణంగా పాఠశాల ఆవరణ గోడ కూలి విద్యార్థులపై పడే ప్రమాదం ఏర్పడింది. ఈ లీకేజీ వల్ల విద్యార్థులతో పాటు గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రధానోపాధ్యాయురాలు అఖిల, ఉపాధ్యాయుడు అశోక్, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలిపారు. దీనిపై ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్