వికారాబాద్ జిల్లా పరిగి మండలం కండ్లపల్లి గ్రామంలో ఆదివారం కులమతాలకు అతీతంగా మొహరం పండుగను గ్రామ సర్పంచ్ పవిత్ర అబ్రహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ యువత ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్రహం గారు మొహరం యొక్క గొప్పతనాన్ని వివరించారు.