వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ పవిత్ర అబ్రహం, ఉపసర్పంచ్ సరితా రవీందర్, వార్డు సభ్యులు మంగళవారం పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ నిమర్జనం వరకు ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఓపికతో, నియమనిష్టలతో ఉండాలని, ఏదైనా అవసరం లేదా ఇబ్బంది కలిగితే తమను సంప్రదించాలని సర్పంచ్ సూచించారు. ఈ పుణ్యకార్యంలో పుణ్య దంపతులు కూడా పాల్గొన్నారు.