చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ధన్నారం తండాకు చెందిన తారాబాయి కుటుంబానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 7 లక్షల పరిహారంతో పాటు ఈ సాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.