రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా: వికారాబాద్ SP

1చూసినవారు
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా: వికారాబాద్ SP
మునిసిపల్ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా పోలీస్ అధికారులతో ఆన్లైన్ ఓరియంటేషన్ సమావేశంలో SP స్నేహ మెహ్రా పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆమె సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసే అక్రమ మద్యం రవాణా, నగదు పంపిణీని అరికట్టాలని స్పష్టం చేశారు. లైసెన్స్డ్ ఆయుధాలను తక్షణమే డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను SP ఆదేశించారు. ఈ సమావేశం ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం లక్ష్యంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్