బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం విద్యార్థులతో కలిసి సామూహిక వందేమాతరం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేమాతరం దేశ సమైక్యతకు తోడ్పడుతుందని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.