నూతన పింఛన్ల వెరిఫికేషన్: ఇంటింటి సర్వేలో అధికారులు, సర్పంచ్

1చూసినవారు
నూతన పింఛన్ల వెరిఫికేషన్: ఇంటింటి సర్వేలో అధికారులు, సర్పంచ్
పరిగిలో మంగళవారం నూతన పింఛన్ల వెరిఫికేషన్ లో భాగంగా ఇంటింటి సర్వే జరిగింది. పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి వచ్చిన జయప్రకాష్, గ్రామ సర్పంచ్ పవిత్ర అబ్రహం, గ్రామ పంచాయతీ కార్యదర్శి వినోద్, వార్డు సభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. వితంతు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు సంబంధించిన దరఖాస్తుల వివరాలను ఇంటింటికి వెళ్లి తెలుసుకున్నారు. వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని సర్పంచ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్