జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 'ఆపరేషన్ స్మైల్-XII'లో 151 మంది చిన్నారులను రక్షించినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. వీరిలో 130 మంది బాలురు, 21 మంది బాలికలు ఉన్నారు. వివిధ పనుల్లో బాలకార్మికులుగా మగ్గుతున్న 104 మందిని, బడి మానేసిన 45 మందిని, భిక్షాటన చేస్తున్న ఇద్దరు బాలికలను రక్షించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశామని ఎస్పీ తెలిపారు.