వికారాబాద్: అదనపు కట్నం వేధింపులు.. మహిళ మృతి

85చూసినవారు
వికారాబాద్: అదనపు కట్నం వేధింపులు.. మహిళ మృతి
వికారాబాద్ లో నవ వధువు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సాకేత్ నగర్ కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్ లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించసాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులకు ఫోన్లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.