శనివారం రావులపల్లి కలాన్- శంకరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పట్టాల పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని వికారాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 30-35 ఏళ్ల వయస్సు గల మృతుడు నీలిరంగు ఫుల్ షర్టు, బూడిద రంగు జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని కుడి చేతికి తెలుపు రంగు కడియం ఉందని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వికారాబాద్ రైల్వే పోలీసుల చరవాణి నంబర్ 84669 38357 ను సంప్రదించాలని పోలీసులు కోరారు.