వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సిమెంట్ ట్యాంకర్ పూర్తిగా రోడ్డుపై ఉండడంతో వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సిమెంట్ ట్యాంకర్ ను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. వికారాబాద్- తాండూరు వెళ్లే మార్గం కావడంతో ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.