వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, 24 గంటల అంబులెన్స్, నాణ్యమైన ఆహారం వంటి సౌకర్యాలు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం జిల్లా బృందం ఆసుపత్రిని సందర్శించి సమస్యలను పరిశీలించింది. కలెక్టర్, డీఎంహెచ్‌వోలు ఆసుపత్రి సేవలను నిరంతరం పర్యవేక్షించాలని వారు కోరారు.