బషీరాబాద్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెనను ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వాల్యానాయక్ తండాకు చెందిన బాల్యానాయక్, నంద్యాయనాయక్ తండాకు చెందిన తుల్జా నాయక్ కలిసి ద్విచక్రవాహనంపై యాలాల మండలం రేళ్లగడ్డ తండాలో బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బషీరాబాద్ వద్ద మలుపులో బైక్ వంతెనకు బలంగా ఢీకొట్టడంతో బాల్యానాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తుల్జానాయకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.