పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి అభ్యర్థుల ఉన్నత చదువులకు ప్రోత్సహించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఇంటర్, ఆపై స్థాయి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదన్నారు.