మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి 10వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన అభివృద్ధి పనులు, సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి, గడ్డం అనన్యను ఛైర్పర్సన్గా చేయడం ఖాయమని ఆయన ధీమాతో తెలిపారు.