వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం సెలవు రోజున పర్యాటకుల సందడి నెలకొంది. హైదరాబాద్, చేవెళ్ల ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ప్రాజెక్టు పరిసరాలు కళకళలాడాయి. యువకులు, చిన్నారులు నీటి ప్రవాహం వద్ద ఉల్లాసంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద బోటింగ్, ఫుడ్ సదుపాయాలు అందుబాటులో ఉండటం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు.