వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలంలో బాలమణి అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మంగళవారం పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. మృతురాలు ఎత్తిరాజ్ పల్లి గ్రామానికి చెందిన నాగమణిగా గుర్తించారు. దుండగులు ఆమె వద్ద ఉన్న మూడు తులాల బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.