వికారాబాద్ రైల్వే జంక్షన్‌లోని మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా నీళ్ల బాటిళ్లు అమ్ముతున్నారని ప్రయాణికులు ఆరోపించారు. రూ. 14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ. 6 వసూలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని తెలిపారు. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్టాల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు పేర్కొన్నారు.