ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు అని అనడం సరైనదేనా అని
బీజేపీ నాయకులు రామకృష్ణ ఆర్కే ప్రశ్నించారు. హరిహరులకు భేదం లేదని మన ధర్మం చెబుతుంటే, దేవుళ్లను పేద-ధనిక, ఉత్తర-దక్షిణ అని విడగొట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని, ఓట్ల కోసం దేవుళ్ల మధ్య
రాజకీయం చేయడం మానుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లో మంగళవారం డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను
బీజేపీ ఖండిస్తున్నట్లు తెలిపారు.