యాలాల: మృతి చెందిన వ్యక్తి వివరాలు గుర్తింపు

55చూసినవారు
యాలాల: మృతి చెందిన వ్యక్తి వివరాలు గుర్తింపు
వికారాబాద్ జిల్లా యాలాల మండలం కాగ్ని నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి వివరాలను బుధవారం పోలీసులు సేకరించారు. మృతుడు తాండూరులోని సాయిపూరుకు చెందిన శ్రీనివాస్ (40)గా గుర్తించారు. తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన శ్రీనివాస్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. శ్రీనివాస్ గత నెల 31న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, మద్యం అలవాటు ఉండటంతో నీటిలో పడి చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్