
‘వందేమాతరం’పై చర్చను ప్రారంభించిన మోదీ
TG: వందేమాతరం గీతంపై చర్చ చేపట్టినందుకు ప్రధాని మోదీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం లోక్సభలో వందేమాతరం గేయంపై చర్చను ప్రారంభించారు. 'స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన వందేమాతర గీతంపై చర్చ జరపడం మనందరి అదృష్టం. ఈ చర్చ.. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుంది. ఈ మధ్యే మనం రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకున్నాం' అని అన్నారు.




