ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన తర్వాత ఆర్‌సీబీ ఆటగాళ్లు ఊర మాస్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్ సహా జట్టు సభ్యులు డప్పుల బీట్స్‌కు తగ్గట్లు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. కృనాల్ పాండ్య ట్రోఫీని నెత్తిన పెట్టుకుని చిన్నపిల్లాడిలా డాన్స్ చేయగా, విరాట్
కోహ్లీ కూడా జోరుగా స్టెప్పులు వేస్తూ సహచరులను ఎంకరేజ్ చేశాడు. ఈ సెలబ్రేషన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.