మేకను దొంగిలించారని విద్యార్థులను కొట్టిన గ్రామస్తులు

77చూసినవారు
మేకను దొంగిలించారని విద్యార్థులను కొట్టిన గ్రామస్తులు
ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఇందకోలి గ్రామంలో మేకను దొంగిలించారన్న ఆరోపణలపై ఇద్దరు విద్యార్థులను గ్రామస్థులు కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలుడు, మరో బాలుడు మేకను దొంగిలించారని ఆరోపిస్తూ గ్రామస్థులు వారిని తాడుతో కట్టి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి ఒక బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్