TG: గర్భిణిని ఆస్పత్రిని తరలించడానికి గ్రామస్తులు చేయి చేయి కలిపి వాగు దాటించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు చేయి చేయి కలిపి వాగు దాటించారు. ఆ పై 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.