విమల్ ఇలాచీ ప్రకటనల వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. బ్రాండ్ అంబాసిడర్లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర FDA జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని PB Agro పిటిషన్ దాఖలు చేసింది. విమల్ ఇలాచీ పేరుతో పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై FDA నోటీసులు ఇచ్చింది. అయితే ప్రకటనలు చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ కేసులో భౌగోళిక పరిధి అంశంపై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.