
భార్య, ముగ్గురు కుమార్తెలను ఇటుకతో దాడి చేసి చంపిన భర్త!
రాజస్తాన్ రాజధాని జైపూర్లో శుక్రవారం రాహుల్ ఝా అనే వ్యక్తి తన భార్య గీతా ఝా (40), ముగ్గురు కుమార్తెలపై నిద్రిస్తున్న సమయంలో ఇటుకతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుండి నిందితుడు రాహుల్ ఝా పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.




