TG: హైదరాబాద్లో 69 అడుగుల ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సాంకేతిక సమస్యల కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మొదలైన ఈ యాత్ర, ఖైరతాబాద్ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా
ఎన్టీఆర్ మార్గానికి చేరుకోనుంది. మధ్యాహ్నం 1:30 గంటలలోపు హుస్సేన్ సాగర్ క్రేన్ నంబర్-4 వద్ద నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా డ్రోన్ కెమెరాల నిఘా, పకడ్బందీ పోలీసు బందోబస్తు మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది.