వినాయక చవితి సందర్భంగా ముంబయిలోని కింగ్స్ సర్కిల్‌లో అత్యంత ధనిక వినాయకుడు పూజలందుకోనున్నాడు. 267 కేజీల బంగారు ఆభరణాలతో గణపయ్యను అలంకరించారు. 350 కేజీల వెండి సింహాసనం ఏర్పాటు చేశారు. 70 ఏళ్లుగా జీఎస్‌బీ సేవా మండలి ఏటా వినాయక విగ్రహాన్ని పెడుతున్నారు. ఈ విగ్రహంపై రూ.444 కోట్ల బీమా ఉండటం గమనార్హం. గణపతి మండపం వద్ద నిత్యాన్నదానం ఉంటుంది.