వినేశ్ ఫొగాట్ ఆరోపణలు ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్

5757చూసినవారు
వినేశ్ ఫొగాట్ ఆరోపణలు ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్
WFI తనను ఉఉద్ద్దేశపూర్వకంగా రెజ్లింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటుందని భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు ముగిసినట్లు పోర్టల్‌లో చూపించిందని, WFI సిబ్బంది స్పందించడం లేదని ఆమె పేర్కొన్నారు. అయితే, WFI ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ ఈ ఆరోపణలను ఖండించారు. వినేశ్ ఫొగాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు స్క్రీన్‌షాట్ పంచుకుంటూ, ఆమె ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని, దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్