మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఇద్దరు జవాన్లు మృతి

37734చూసినవారు
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఇద్దరు జవాన్లు మృతి
‌మణిపూర్‌లోని విష్ణుపూర్ లో మళ్లీ  హింస చెలరేగింది. అసోం రైఫిల్స్ కాన్వాయ్ పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరికొందరు అధికారులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనను మణిపుర్‌ గవర్నర్‌ అజయ్‌ భల్లా తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో అమరులైన సిబ్బంది కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.