తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు–జనవరి నెలల్లో జరిగే పర్వదినాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. డిసెంబరు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు, డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి సందర్భంగా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేసి, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. పర్వదినాల ముందు వీఐపీ లేఖలు స్వీకరించబోమని TTD తెలిపింది.