AP: ఇంద్రకీలాద్రిపై ఇవాళ వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఘాట్ రోడ్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తాత్కాలిక నిలిపివేతతో సామాన్య భక్తులకు దర్శనం సులభతరం అవుతుందని భావిస్తున్నారు.