చెన్నై గిండి రైల్వే స్టేషన్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సెప్టెంబర్ 23న విల్లుపురం-చెన్నై బీచ్ రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన 69 ఏళ్ల ప్రయాణికుడు ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయాడు. రైలు కదులుతుండటంతో దాదాపు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రయాణికులు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్టేషన్ గార్డు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు.