మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో పేషెంట్‌తో కలిసి బంధువులు మందు తాగిన ఘటన కలకలం రేపింది. సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న దేవేంద్ర యాదవ్‌ను చూడటానికి వచ్చిన ఇద్దరు బంధువులు మద్యం బాటిల్స్, గ్లాసులతో వచ్చి పేషెంట్ పక్కనే కూర్చుని మందు సేవించారు. హెల్త్ కేర్ ఆఫీసర్ గాయత్రి చౌదరి వారిని అడ్డుకున్నా వినిపించుకోలేదు. ఆస్పత్రి నియమాలను ఉల్లంఘించి ఇతర రోగులకు ఇబ్బంది కలిగించారు. కాగా, ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.