ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చేజింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని డిస్టర్బ్ చేసేందుకు సాయి సుదర్శన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయిన తర్వాత, సాయి సుదర్శన్, విరాట్
కోహ్లీ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. నువ్వు ఔట్ అయితే మ్యాచ్ మా చేతుల్లోకి వస్తుందని సాయి సుదర్శన్ అన్నట్లు, అయితే తాను చివరి వరకు ఆడతానని విరాట్
కోహ్లీ బదులిచ్చినట్లు వీడియో వైరల్ అవుతుంది.