టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్
కోహ్లీ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న
భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో
కోహ్లీ వన్డేల్లో 15,000 పరుగులు పూర్తిచేసే మైలురాయికి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 302 ఇన్నింగ్స్‌ల్లో 14,941 పరుగులు చేసిన కోహ్లీకి మరో 59 పరుగులు అవసరం. ఈ రికార్డు సాధిస్తే వన్డేల్లో 15 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే, సొంతగడ్డపై సచిన్ టెండూల్కర్ (6,976) రికార్డును అధిగమించడానికి 110 పరుగులు చేయాల్సి ఉంది.