
పడిపోయిన భారత్ పాస్పోర్ట్ ర్యాంకింగ్
2025 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాల జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంస్ద విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ ర్యాంకు గతేడాది కంటే ఐదు స్థానాలు దిగజారి 85వ స్థానానికి పడిపోయింది. గతంలో 62 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉండగా ఇప్పుడు 57 దేశాలకు మాత్రమే పరిమితమైంది. సింగపూర్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, జపాన్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి.




