
పాకిస్థాన్‌కు యుద్ధ విమానాల డెలివరీ నిలిపివేసిన చైనా
భారత వైమానిక దళంలోని రఫేల్ విమానాలకు పోటీగా పాకిస్థాన్ చైనా నుంచి అత్యాధునిక జె-10సిఇ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావించింది. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, ఒప్పందం ప్రకారం మిగిలిన 16 విమానాలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో చైనా వాటి డెలివరీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది పాకిస్థాన్ వైమానిక దళానికి కోలుకోలేని దెబ్బగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.




