
వాట్సాప్ చాట్‌ల ఆధారంగా విడాకులు ఇవ్వలేం: బాంబే హైకోర్టు
విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం వాట్సాప్ చాట్‌ల ఆధారంగా క్రూరత్వం ఆరోపణలు పరిగణనలోకి తీసుకుని విడాకులు మంజూరు చేయలేమని, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వులను పక్కన పెట్టింది. నాసిక్ నుంచి పుణెకు మారాలని, అత్త, వదినలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భర్త వాట్సాప్ చాట్‌లను ఆధారంగా చూపగా, ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే, హైకోర్టు ఈ తీర్పును కొట్టివేసి, కేసును తిరిగి ఫ్యామిలీ కోర్టుకు పంపింది. మధ్యవర్తిత్వం ద్వారా కలిసి ఉండే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించింది.




