
భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ధరలు !
ఇరాన్ దాడి కారణంగా పాలీఫెనిలిన్ ఈథర్ (పీపీఈ) ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీ) తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో పీసీబీల ధరలు ఏకంగా 40% పెరిగాయి. ఈ పరిస్థితి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఏఐ సేవల ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. పీపీఈ అనేది పీబీసీ లామినేట్స్ తయారీకి అత్యంత కీలకమైన ముడిపదార్థం. యూనిట్ కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తీవ్రమైన పీపీఈ కొరత ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ధరలపై ప్రభావం చూపనుంది.




