ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లా, రుద్రపూర్ గ్రామంలోని దుగ్దేశ్వర్నాథ్ ఆలయంలో ఉన్న సుమారు 2 వేల సంవత్సరాల నాటి శివలింగం స్వయంగా కదులుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఎటువంటి బాహ్యశక్తి లేకుండా, పరమశివుని సంకల్పంతోనే ఇది జరుగుతుందని పండితులు చెబుతున్నారు. పూర్వజన్మ సుకృతం, నిజమైన భక్తి ఉన్నవారికి మాత్రమే ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుందని అర్చకులు తెలిపారు. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అప్పుల బాధలు తొలగి, సంపద పెరుగుదల, అకాల మృత్యు భయాలు పోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.