విటమిన్ బి12 లోపం మహిళల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. ఈ పోషకం మెదడు పనితీరు, హార్మోన్ల సమతుల్యత, గుండె, ఎముకల ఆరోగ్యానికి కీలకం. ఈ విటమిన్ లోపం వల్ల అలసట, జ్ఞాపక శక్తి తగ్గడం, చర్మం పసుపు రంగులోకి మారడం, నోటి పుండ్లు, శ్వాస సమస్యలు, కంటి చూపు మందగించడం, నెలసరి సమస్యలు, మానసిక ఆందోళన, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాల ద్వారా బి12 పొందవచ్చు. సమస్య తీవ్రతను బట్టి వైద్యుల సలహాతో మందులు వాడాలి.