విటమిన్ సి చర్మా
నికి మేలు చేసినప్పటికీ, ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటే కేవలం 2% మాత్రమే చర్మానికి అందుతుందని వైద్యులు చెబుతున్నారు. మిగిలినది శరీరానికి ఉపయోగపడుతుందని, మచ్చలు తగ్గించి మెరుపు పొందడానికి ట్యాబ్లెట్లు అంతగా ప్రయోజనకరంగా ఉండవని సూచిస్తున్నారు. అయితే రోజూ సన్‌స్క్రీన్ వాడటం, మొటిమలను గిల్లకపోవడం, చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడం వంటివి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొంటున్నారు.