మరోసారి వివేక హత్య కేసు విచారణ వాయిదా

21663చూసినవారు
మరోసారి వివేక హత్య కేసు విచారణ వాయిదా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీం కోర్టు మళ్లీ వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా?, కాదా? అని కోర్టు సీబీఐను ప్రశ్నించింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్సీ రాజు హాజరై మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు. దీంతో జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.