వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. గతంలో విధించిన కండిషన్ బెయిల్ నిబంధనలను సడలిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బెయిల్ మంజూరుతో భాస్కర్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యంగా పులివెందులకు రానున్నారు. ఆయన రాకతో పులివెందుల రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.