
కేసు పరిష్కారం కోసం పిలిచి.. మహిళపై న్యాయవాది అత్యాచారం
ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కేసు పరిష్కారానికి వచ్చిన ఓ మహిళపై న్యాయవాది అత్యాచారం చేశాడు. 37 ఏళ్ల మహిళపై గతంలో జరిగిన అత్యాచారం కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. న్యాయవాది జితేంద్ర నిందితుల తరపున కోర్టులో వాదిస్తున్నాడు. రాజీ కోసం ఆ మహిళను పలిచి కారులో ఎక్కించుకుని మద్యం తాగించాడు. అనంతరం హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయవాదిని అరెస్ట్ చేశారు.




