రైతుల కోసం వాలంటీర్ల వ్యవస్థ.. ప్రభుత్వం నిర్ణయం

17చూసినవారు
రైతుల కోసం వాలంటీర్ల వ్యవస్థ.. ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ రానుంది. తొలుత కొడంగల్ నియోజకవర్గంలో నియమించనున్న వీరికి ప్రస్తుతం శిక్షణ అందిస్తున్నారు. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను నియమిస్తారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 30 వేల మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించనుంది. వీరు రైతులకు భూసారం ఎలా కాపాడాలి.. పంటకు అనుకూలంగా భూమిని ఎలా మార్చుకోవాలి వంటి సలహాలు, సూచనలు చేస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్