ఓట్ల తొలగింపు కలకలం.. ఒకే కుటుంబంలోని 30 మందిపై ఫామ్-7

8చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 210లో ఒకే ముస్లిం కుటుంబానికి చెందిన 30 మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని వార్తలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ BLA ఎస్. బాలచందర్ (బాలు) ముందే ప్రింట్ చేసిన ఫామ్-7 దరఖాస్తులను అందించారని ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు రాజేష్ కుమార్, వాజిద్ హుస్సేన్‌లు రాష్ట్ర సీఈఓ సి. సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి మార్పులు జరుగుతున్నాయేమోనని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్